సీఎంఆర్ వాడుకుంటే ఆస్తులు సీజ్​ చేస్తాం : అంజయ్య

సీఎంఆర్ వాడుకుంటే ఆస్తులు సీజ్​ చేస్తాం : అంజయ్య

చిట్యాల, వెలుగు : సీఎంఆర్ ను మిల్లర్లు వాడుకుంటే వ్యక్తిగత ఆస్తులు సీజ్​చేస్తామని విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ టీం అధికారి అంజయ్య హెచ్చరించారు. చిట్యాల మండలం వట్టిమర్తిలో శ్రీజ కార్పొరేషన్ మిల్లులో 460 క్వింటాళ్లు, వనిపాకలలోని జై హనుమాన్ రైస్ మిల్లులో 16 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన బియ్యాన్ని స్వాధీనం చేసుకుని నల్గొండలోని నిల్వ కేంద్రానికి తరలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ బియ్యం కొనుగోలు చేసినా.. అమ్మినా చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు. గడువులోపు సీఎంఆర్ రైస్ ప్రభుత్వానికి ఇవ్వకుంటే రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు.