ఎన్​ఎండీసీలో విజిలెన్స్​ అవేర్‌‌‌‌‌‌‌‌నెస్ వీక్

హైదరాబాద్, వెలుగు:  నేషనల్​ మినరల్​ డెవెలప్​మెంట్​ కార్పొరేషన్​ (ఎన్​ఎండీసీ)  తన విజిలెన్స్ అవేర్‌‌‌‌‌‌‌‌నెస్ వీక్ 2023 ప్రచారంలో భాగంగా ఉద్యోగులకు హైదరాబాద్​లో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కంపెనీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్  బి. విశ్వనాథ్ నాయకత్వం వహించారు. ఉద్యోగులు న్యాయబద్ధంగా, నైతిక పద్ధతుల్లో వ్యవహరించాలని సూచించారు. ఇందుకోసం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విడుదల చేసిన మార్గదర్శకాల గురించి వివరించారు. 

జవాబుదారీతనం,  సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి కొత్త టెక్నాలజీలను వాడుకోవాలని కోరారు.  ఇనుము కోసం ప్రస్తుత,  భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. "ఎంక్వయిరీ ఆఫీసర్  ప్రెజెంటింగ్ ఆఫీసర్" అనే అంశంపై డాక్టర్ ఉపేంద్ర వెన్నమ్ తో ఇంటరాక్టివ్ సెషన్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. రాజ్యాంగం,  డీఓపీటీ నిబంధనల గురించి ఆయన వివరించారు.    వీడియో సందేశం ద్వారా సంస్థ సీఎండీ (అడిషనల్​ చార్జ్​)  అమితావ ముఖర్జీ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌లను తీర్చిదిద్దడానికి కంపెనీ విజిలెన్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ చేసిన కృషిని అభినందించారు.