HCA, SRH వివాదం.. ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ

HCA, SRH వివాదం.. ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ

హెచ్​సీఏ(హైదరాబాద్ క్రికెట్ అసొసియేషన్), సన్​రైజర్స్ హైదరాబాద్(ఎస్ ఆర్ హెచ్)​ వివాదంపై ఉప్పల్ స్టేడియంలో  విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతోంది.  సన్ రైజర్స్,హెచ్ సీఏ  మధ్య జరిగిన ఈమెయిల్స్  ను అధికారులు చెక్ చేస్తున్నారు.  ఐపీఎల్ కు ముందు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలపై విచారిస్తోంది విజిలెన్స్.  ఇప్పటికే రెండు సంవత్సరాలుగా హెచ్ సీఏ  చేపట్టిన రెనవేషన్  వాటికి సంబంధించిన లెక్కలు పరిశీలిస్తున్నారు అధికారులు. సన్ రైజర్స్  ,హెచ్సీఏ మధ్య ఐపీఎల్ కు ముందు జరిగిన ఒప్పందాలకు సంబంధించి రికార్డ్స్ ను పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారులు. డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉప్పల్ స్టేడియాని వచ్చారు. ఇప్పటికే  అందుబాటులో ఉన్న ఆఫీస్ బేరర్ లందరికీ స్టేడియానికి రావాలంటూ సమాచారం ఇచ్చారు విజిలెన్స్ అధికారులు.

ఇదీ వివాదం

తమిళనాడుకు చెందిన సన్‌‌ నెట్‌‌ వర్క్‌‌  యాజమాన్యంలోని సన్‌‌ రైజర్స్ ఫ్రాంచైజీ ఐపీఎల్‌‌లో అడుగు పెట్టినప్పటి నుంచి హైదరాబాద్‌‌ను తమ హోమ్‌‌ గ్రౌండ్‌‌గా ఎంచుకొని ఉప్పల్‌‌ స్టేడియంలో మ్యాచ్‌‌లు ఆడుతున్నది. ఐపీఎల్‌‌ టైమ్‌‌లో ఉప్పల్‌‌ స్టేడియాన్ని రెంట్‌‌కు తీసుకుంటున్నది. ఇందుకు ప్రతి మ్యాచ్‌‌కు హెచ్‌‌సీఏకు రూ.కోటి చెల్లిస్తున్నది. ఐపీఎల్‌‌ మ్యాచ్‌‌ టికెట్ల విక్రయాలను సన్ రైజర్స్ ఫ్రాంచైజీనే  చూసుకుంటున్నది. స్టేడియం కెపాసిటీ 39 వేలు కాగా.. ఇందులో పది శాతం అంటే 3,900 టికెట్లను కాంప్లిమెంటరీ పాసుల రూపంలో హెచ్‌‌సీఏకు ఉచితంగా ఇస్తున్నది. 

ALSO READ | హెచ్​సీఏ, సన్​రైజర్స్​ వివాదంపై.. విజిలెన్స్​ ఎంక్వైరీ! ఆదేశించిన సీఎం రేవంత్​

వీటిలో రూ. 750 కనీస ధర టికెట్ల నుంచి  రూ. 20 వేలు విలువ చేసే అన్ని సౌకర్యాలతో కూడిన కార్పొరేట్ బాక్స్‌‌ పాసులు కూడా ఉంటాయి. కార్పొరేట్ బాక్సు పాసుల కేటాయింపు విషయంలో సన్ రైజర్స్‌‌కు, హెచ్‌‌సీఏ ఆఫీస్ బేరర్లకు మధ్య విభేదాలు వచ్చాయి. ఉప్పల్ స్టేడియం సౌత్ స్టాండ్ ఫస్ట్‌‌ ఫ్లోర్‌‌‌‌లోని  ఎఫ్‌‌–12-ఏ బాక్సులో గత పదేండ్ల నుంచి హెచ్‌‌సీఏకు సన్ రైజర్స్ 50 టికెట్లు కేటాయిస్తున్నట్టు చెబుతున్నది. కానీ, ఆ బాక్స్‌‌ కెపాసిటీ 30 సీట్లు మాత్రమే అని హెచ్‌‌సీఏ అంటున్నది. కాబట్టి మిగతా 20 టికెట్లు వేరే బాక్సుల్లో సర్దుబాటు చేయాల్సిందిగా ఈ సీజన్ ముందుగానే రిక్వెస్ట్ చేయగా..సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఒప్పుకున్నది. 

అయితే, గత రెండు మ్యాచ్​లలో  ఆ బాక్సుకు 50 టికెట్లు కేటాయించినట్టు చెబుతున్నది. ఈ నెల 27న లక్నో మ్యాచ్ సందర్భంగా ఈ విషయంపై ఇరు వర్గాల మధ్య వివాదం ముదిరింది. ఇతర బాక్సుల్లో 20 టికెట్లు కేటాయించాలంటూ   పట్టుబట్టినా వినకపోవడంతో  ఎఫ్‌‌3 బాక్సుకు హెచ్‌‌సీఏ తాళం వేసింది. దాన్ని  లక్నో ఓనర్‌‌‌‌ సంజీవ్‌‌ గోయెంకకు కేటాయించడంతో హెచ్‌‌సీఏ పెద్దలు కావాలనే తమను బ్లాక్‌‌మెయిల్ చేశారంటూ సన్‌‌ రైజర్స్ ఫ్రాంచైజీ శ్రీనాథ్‌‌ ఈ మెయిల్ లో ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదిరింది. 

హెచ్‌‌సీఏ వాదన ఇది..

సన్‌‌ రైజర్స్ ఫ్రాంచైజీ ఆరోపణలను హెచ్‌‌సీఏ ఖండించింది. తమ ఆఫీస్‌‌ బేరర్ల పట్ల కొందరు  ఎస్ఆర్‌‌హెచ్ ఉద్యోగుల అనుచిత తీరువల్లే ఈ సమస్యలు వస్తున్నాయని, హెచ్‌‌సీఏ ప‌‌రువుకు భంగం క‌‌లిగించేలా చేయ‌‌డం సరికాదని తెలిపింది. ‘గ‌‌త రెండు మ్యాచ్‌‌ల‌‌కు ఎస్ఆర్‌‌హెచ్  మాకు 3,880 కాంప్లిమెంట‌‌రీ పాసులే ఇచ్చింది. ఎఫ్‌‌-12–ఏ బాక్సులో సామ‌‌ర్థ్యానికి మించి  50 టిక్కెట్లు ఇస్తామంటే, మేం ఆ బాక్సులో 30 ఇచ్చి మిగిలిన 20 పాసులు మ‌‌రో బాక్సులో స‌‌ర్దుబాటు చేయ‌‌మ‌‌న్నాం. 

సన్ రైజర్స్‌‌ అధికారుల నుంచి ఎంతకూ స్పందన లేకపోవడం వల్లే ఈ నెల 27న‌‌ ఎఫ్‌‌–-3 బాక్స్‌‌ను తాత్కాలికంగా లాక్ చేయాల్సి వచ్చింది. అయితే, ఎస్ఆర్‌‌హెచ్ ప్రతినిధులు కిర‌‌ణ్‌‌, శ‌‌ర‌‌వణ‌‌న్‌‌, రోహిత్ సురేశ్​ వచ్చి మాట్లాడటంతో  మ్యాచ్ ప్రారంభానికి గంటల ముందు బాక్స్ తిరిగి తెరిచాం. కానీ, హెచ్‌‌సీఏ ట్రెజరర్​ సీజే శ్రీనివాస్‌‌తో జ‌‌రిగిన ఈ భేటీలో పాల్గొన‌‌ని శ్రీనాథ్  బ్లాక్‌‌మెయిల్ చేస్తున్నార‌‌నే అర్థంతో ఈ-మెయిల్‌‌ చేయడం సరికాదు’ అని హెచ్‌‌సీఏ ప్రకటనలో తెలిపింది.  

ఈవివాదంతో  హైదరాబాద్ బ్రాండ్‌‌ ఇమేజ్‌‌ దెబ్బతినే ప్రమాదం ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. ఎస్‌‌ఆర్‌‌‌‌హెచ్‌‌, హెచ్‌‌సీఏ వివాదంపై విజిలెన్స్​విచారణకు ఆదేశించారు.