మున్సిపాలిటీ అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలి : మున్సిపల్ వైస్ చైర్​పర్సన్

మున్సిపాలిటీ అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలి : మున్సిపల్ వైస్ చైర్​పర్సన్
  • సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్​ పర్సన్ తోట సుజలరాణి

సత్తుపల్లి, వెలుగు : సత్తుపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి మాటున జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని మున్సిపల్ వైస్ చైర్​పర్సన్ తోట సుజలరాణి కోరారు. మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అవినీతి అక్రమాల్లో సత్తుపల్లి మున్సిపాలిటీ రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని ఆరోపించారు. స్వయంగా తమ కుటుంబ సభ్యుడికి సంబంధించిన డెత్ సర్టిఫికెట్ ఇవ్వడంలో చాలా ఇబ్బంది పెట్టారన్నారు.

ప్రశాంతంగా ఉన్న సత్తుపల్లిలో రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా, మున్సిపాలిటీ ద్వారా ఏర్పాటు చేసిన సిమెంట్ బల్లాలకు బీఆర్ఎస్ పార్టీ రంగు వేసి ప్రజా ధనంతో పార్టీ కోసం ప్రచారం చేసేందుకు ప్రయత్నించారని, దీనిని ప్రజలు తిప్పికొట్టారని తెలిపారు. కౌన్సిలర్ దూదిపాళ్ల రాంబాబు మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసేందుకు ప్రవేశపెట్టిన ఎజెండా కాపీనీ పక్కకు పెట్టి, వారికి అనువైన పనులతో రూపొందించుకున్న ఎజెండా కాపీని ఏకపక్షంగా ఆమెదించి అక్రమాలకు పాల్పడ్డారన్నారని ఆరోపించారు. అంబేద్కర్ కాంస్య విగ్రహం, పట్టణ శివారులో ఏర్పాటు చేసిన వెల్ కమ్ సత్తుపల్లి, లవ్ సత్తుపల్లి పార్కులు

జే వీ ఆర్ పార్కు, 100 అడుగుల జాతీయ జెండా, శిలా తోరణం, సిమెంట్​ బల్లాల ఏర్పాటులో భారీ కుంభకోణం జరిగిందన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు మాట్లాడుతూ బీజేపీ కళ్లున్న కబోదని, గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ అక్రమాలు, అవినీతిని ప్రశ్నించకుండా కేవలం ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని విమర్శించడం బాధాకరమన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్, కౌన్సిలర్లు మందపాటి పద్మ జ్యోతి, కంటే నాగలక్ష్మి, నాగుల్ మీరా, కాంగ్రెస్ జిల్లా నాయకులు రామిశెట్టి సుబ్బారావు, చల్లగుల్ల కృష్ణయ్య, రవీంద్ర రెడ్డి, శ్రీనివాసరెడ్డి, గఫార్, కమల్ పాషా ఉన్నారు.