స్మార్ట్ సిటీ పనులపై విజిలెన్స్ ఎంక్వైరీ

స్మార్ట్ సిటీ పనులపై విజిలెన్స్ ఎంక్వైరీ

కరీంనగర్ సిటీ, వెలుగు : కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతిపై విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తోందని, అవినీతికి పాల్పడిన ప్రతిఒక్కరూ జైలుకు వెళ్లడం ఖాయమని కాంగ్రెస్ నేత మెండి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం ఓ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కార్పొరేటర్లు, లీడర్లతో కలిసి   మీడియాతో మాట్లాడుతూ స్మార్ట్ సిటీ పనులను మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఒకే కాంట్రాక్టర్​కు అన్ని పనులు ఇచ్చి కమీషన్ తీసుకున్నాడని ఆరోపించారు.

రాష్ట్రంలో ఎక్కడ లేని జీవో తీసుకువచ్చి సిటీలో నిర్మించిన 200 అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లకు ఒక్కోదానికి రూ.5 లక్షల చొప్పున రూ. 10 కోట్ల తీసుకున్నాడన్నారు. రేకుర్తిలో 10 గుంటలు కొని పక్కనున్న మరో 10 గుంటలు కబ్జా చేశాడన్నారు. ఈ అవినీతి వ్యవహారం నుంచి బయట పడేందుకే కేంద్ర మంత్రి బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొగుడుతున్నాడన్నారు.

మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతిపై ఇప్పటికే మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సమావేశంలో లీడర్లు ఆకుల ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గంట శ్రీనివాస్,  వైద్యుల అంజన్ కుమార్, ఆకుల నరసయ్య, కాశిట్టి శ్రీనివాస్, పడిశెట్టి భూమయ్య  పాల్గొన్నారు.