కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్‌లో విజిలెన్స్ఆఫీసర్లు బుధవారం తనిఖీలు చేపట్టారు. ప్రస్తుత ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మున్సిపాలిటీలో చేపట్టిన వివిధ పనులు రూల్స్‌కు విరుద్ధంగా జరిగాయని, ఆస్తి పన్ను విధింపులో లోపాలు ఉన్నాయంటూ గతంలో విజిలెన్స్ఆఫీసర్లకు కంప్లైంట్చేశారు. దీంతో 2 ఏండ్ల కింద మున్సిపాలిటీలో విజిలెన్స్అధికారుల తనిఖీలు జరిగాయి.
క్షేత్ర స్థాయిలో రోడ్ల నిర్మాణ పనులు, కమర్షియల్ బిల్డింగుల నిర్మాణం, ఆస్తి పన్ను విధింపునకు సంబంధించి పరిశీలించారు. తర్వాత ఎంక్వైరీ ఆగిపోయింది. తాజాగా మళ్లీ విజిలెన్స్ఆఫీసర్లు రంగంలోకి దిగారు. కొన్ని కమర్షియల్ బిల్డింగులను పరిశీలించి కొలతలు తీసుకున్నారు.