అన్నారం బ్యారేజీని పరిశీలించిన విజిలెన్స్ అధికారులు

అన్నారం సరస్వతీ బ్యారేజ్ ను విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్  డీజీ రాజీవ్ రతన్ పరిశీలించారు.ఇటీవల ఏర్పడిన సీపేజి బుంగల మరమ్మతు పనులను   వాక్ వే  నుంచి పరిశీలించారు.  కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్ కిందిభాగంలోని మోటార్లను,కంట్రోల్ రూంలను ,ఫోర్ బే ,అప్రోచ్ కెనాల్ ,డెలివరీ చానల్ ను కూడా పరిశీలించారు. అనంతరం కంట్రోల్ రూంలో ఇంజనీర్లతో సమావేశమయ్యారు డీజీ.  ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి గతయేడాది వరదల  తీరుపై ఇరిగేషన్ అధికారులు డీజీకి వివరించారు.   డీజీ వెంట ఉన్నతాధికారులు సైతం ఉన్నారు. మరో వైపు  మహదేవపూర్ మండలంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ  రాజీవ్ రతన్ బృందం  రెండో రోజు తనిఖీలు కొనసాగుతున్నాయి. 

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగమైన అన్నారం(సరస్వతి) బ్యారేజీ పిల్లర్ల కింద   బుంగలు పడ్డాయి.అన్నారం బ్యారేజీ 28, 38 గేట్ల ముందు ఏర్పడిన బుంగలను  వాటిని నివారించేందుకు ఇసుక బస్తాలు, బౌల్డర్లు వేసి రింగ్ బండ్ ​నిర్మించారని తెలిపారు.  అన్నారం బ్యారేజీలో బుంగలకు మరమ్మతులు పూర్తి

అన్నారం సరస్వతి బ్యారేజీకి సీపేజీ ఏర్పడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన మరమ్మతు పనులను ఆప్కాన్స్ సంస్థ పూర్తి చేసింది. పాలియూరిథిన్​ గ్రౌటింగ్​ ద్వారా 38, 42 పియర్​ల వద్ద ఏర్పడిన బుంగలను పూడ్చింది.