
హైదరాబాద్, వెలుగు: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని విజ్ఞాన్ వర్సిటీ ఆఫ్ క్యాంపస్ లలో బీటెక్, బీఎస్సీ, అగ్రికల్చరల్, ఫార్మా–డీ ప్రవేశాల కోసం నిర్వహించిన వీశాట్–2025 ఫేజ్–1 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ, కల్నల్ ప్రొఫెసర్ పి. నాగభూషణ్ మాట్లాడారు. వీశాట్‌లో 1 నుంచి 50 లోపు ర్యాంకులు సాధించిన వారికి 50% స్కాలర్‌షిప్, 51 నుంచి 200లోపు ర్యాంకులు సాధించిన వారికి 25% స్కాలర్‌షిప్, 201 నుంచి 2000లోపు ర్యాంకులు సాధించిన వారికి 10% స్కాలర్‌షిప్‌ను నాలుగేండ్ల పాటు అందజేస్తామని తెలిపారు.
ఇంటర్‌లో 970కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు 50% స్కాలర్‌షిప్, 950 నుంచి 969 మార్కులు సాధించిన విద్యార్థులకు 25% స్కాలర్‌షిప్, 920 నుంచి 949 మార్కులు సాధించిన విద్యార్థులకు 10% స్కాలర్‌షిప్ అందజేస్తామని చెప్పారు. ప్రవేశాల కోసం ఏప్రిల్ 16 నుంచి 20 వరకు మొదటి విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. వీశాట్ ఫేజ్–2 ప్రవేశ పరీక్షలను ఏప్రిల్ 13 నుంచి 30వరకు నిర్వహించనున్నామని వెల్లడించారు. వర్సిటీ డీన్ డాక్టర్ కేవీ క్రిష్ణకిషోర్ మాట్లాడుతూ.. పరీక్ష ఫలితాలు వర్సిటీ వెబ్‌సైట్ లో vignan.ac.in/vsatresult/ కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు.