Vignesh Shivan: ఈమధ్య కాలంలో సోషల్ మీడియా వినియోగం బాగా పెరగడంతో కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా చేసే తప్పుడు ప్రచారాల కారణంగా సినీ సెలబ్రేటీలు చిక్కుల్లో పడుతున్నారు. అయితే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయన్, విగ్నేష్ దంపతులు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. డైరెక్టర్ విగ్నేష్ శివన్ పాండిచ్చేరిలో ఉన్నటువంటి ఓ హోటల్ ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని, ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు పాండిచ్చేరి వెళ్లి వచ్చాడని పలు వార్తలు బలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం ఈనోటా, ఆనోటా పాకుతూ విగ్నేష్ శివన్ చెవిన పడింది.
దీంతో ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా విగ్నేష్ శివం స్పందించాడు. ఇందులోభాగంగా తాను పాండిచ్చేరిలో గవర్నమెంట్ కి సంబందించిన హోటల్ ని కబ్జా చేస్తున్నట్లు వినిపిస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు. అలాగే తన నెక్స్ట్ తీయబోయే "లవ్ ఇన్సూరెన్స్ కంపనీ" సినిమా షూటింగ్ పర్మిషన్స్ కోసం పాండిచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామితోపాటూ ఇతర మంత్రుల్ని కలిశానని తెలిపాడు. అయితే తనతోపాటూ వచ్చిన మేనేజర్ తనకి సంబందించిన వ్యక్తిగత విషయాల్ని ముఖ్యమంత్రితో మాట్లాడాడని కానీ ఈ విషయాలు తనకి లింక్ చేస్తూ మీమ్స్, న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని ఆపాలని కోరాడు.
ALSO READ| ఇళయరాజాకు ఆ గుడిలో అవమానం జరిగిందా..? ఎందుకీ రాద్దాంతం.. అసలు ఏం జరిగింది..!
ఈ విషయం ఇలా ఉండగా విగ్నేష్ దర్శకత్వం వహిస్తున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాలో హీరోగా లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథ్ నటిస్తున్నాడు. హీరోయిన్ గా యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి శెట్టి నటిస్తోంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. దాదాపుగా రూ.60 కోట్లు బడ్జెట్ తో సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.