అందుకే ప్రమోషన్స్​కి దూరం

అందుకే ప్రమోషన్స్​కి దూరం

స్టార్​ హీరో సినిమా అయినా సరే నయనతార(Nayanthara) ప్రమోషన్స్​కి రాదు అనే విమర్శ ఇండస్ట్రీలో ఎంతో కాలంగా ఉంది. అయితే, ఇప్పటివరకు దీనిపై నయన్​ స్పందించలేదు. తాజాగా ఆమె భర్త, దర్శకుడు విఘ్నేష్​ శివన్(Vignesh Shivan)​ నయన్​ ప్రమోషన్స్​కి దూరంగా ఉండటానికి గల కారణాలను తెలిపాడు.

నయన్​ మనస్ఫూర్తిగా నమ్మితేనే ప్రచారం చేయడానికి ముందుకొస్తుంది. కొన్నిసార్లు ఆమె తన సొంత సినిమాలను కూడా ప్రమోట్​ చేయడానికి రాదు. సినిమాలో కంటెంట్​ ఉంటే అదే దానిని ముందుకు నడిపిస్తుందని ఆమె నమ్ముతుంది’ అని విఘ్నేశ్​ తెలిపాడు.

ఇక ఇటీవల జవాన్​ ప్రచార కార్యక్రమాల్లో కూడా ఈ నటి అంటీముట్టనట్టుగా ఉంది. ఆమె వైఖరి తెలియని బాలీవుడ్​ మీడియా దర్శకుడితో ఈ హీరోయిన్​కి గొడవలు వచ్చాయిని అందుకే ప్రమోషన్స్​లో కనిపించలేదని వార్తలు కూడా రాసేసింది.