
విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న 25వ చిత్రం ‘భద్రకాళి’. అరుణ్ ప్రభు దర్శకత్వంలో ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. బుధవారం ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘పిల్లి కూడా ఒకరోజు పులి అవును.. అబద్దమూ, అహంకారమూ అంతం అవును’ అనే డైలాగ్స్‌తో మొదలైన టీజర్ ఆసక్తికరంగా సాగింది. పొలిటికల్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రంలో విజయ్ గ్యాంగ్‌స్టర్‌తో పాటు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించాడు.
చిన్న పిల్లాడిగా జైలు కెళ్లిన హీరో పదిహేనేళ్లుగా లోపలే ఉంటూ సిస్టమ్‌ను ఓ ఆట ఆడిస్తూ కిట్టు పాత్రలో విజయ్ కనిపించిన తీరు ఆకట్టుకుంది. ‘ఇది కేవలం ఆరంభం మాత్రమే’ అంటూ టీజర్ చివరిలో విజయ్ చెప్పిన డైలాగ్ ఇంప్రెస్ చేసింది.
వాగై చంద్రశేఖర్, సునీల్ కృపాలిని, సెల్ మురుగన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది.