
ఇటీవల ‘బిచ్చగాడు 2’ చిత్రంతో మెప్పించిన విజయ్ ఆంటోని.. త్వరలో మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అతను హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ‘విక్రమ్ రాథోడ్’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. బాబు యోగేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రావూరి వెంకటస్వామి, ఎస్.కౌసల్య రాణి నిర్మిస్తున్నారు. తెలుగులో ఓం శివ గంగా ఎంటర్‌ప్రైజెస్, పీఎస్ఆర్ ఫిల్మ్స్ సంస్థలు విడుదల చేస్తున్నాయి.
శుక్రవారం ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. డిసెంబర్ 1న సినిమాను విడుదల చేయబోతున్నామని, త్వరలో ట్రైలర్ రిలీజ్ చేస్తామని తెలియజేశారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సురేష్ గోపి, రమ్య నంబీశన్, సోనూ సూద్, సంగీత, యోగిబాబు, రాధా రవి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.