డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో గుర్తింపును అందుకున్న విజయ్ ఆంటోనీ(Vijay Antony), కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. తమిళంలో ‘రోమియో(Romeo)’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులో ‘లవ్ గురు(Love Guru)’గా రానుంది. మృణాళిని రవి ఇందులో హీరోయిన్. విజయ్ ఆంటోనీ సొంత బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వినాయక్ వైద్యనాథన్ దర్శకుడు. ఈ సినిమాను సమ్మర్‌లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. శోభనం రోజు గదిలో భార్య ఆల్కహాల్ గ్లాసులో పోస్తుంటే, భర్త ఆశ్చర్యపోతూ చూస్తున్నట్టుగా దీన్ని డిజైన్ చేశారు. విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి పాత్రలు ఎలా ఉండబోతున్నాయో ఈ పోస్టర్ ద్వారా చూపించారు. మరోవైపు విజయ్ ఆంటోనీ నటించిన ‘హిట్లర్’ చిత్రం కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది.