SpyAction Thriller OTT: తెలుగులోనూ స్ట్రీమింగ్‌కు వచ్చిన..లేటెస్ట్ తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్

స్టార్ హీరో విజయ్ ఆంటోనీ హీరోగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘తుఫాన్’. మేఘా ఆకాష్ హీరోయిన్. కమల్ బోరా, డి లలితా, బి ప్రదీప్, పంకజ్ బోరా నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 11న తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. అయితే థియేటర్లలో డిజాస్టర్ టాక్ దక్కించుకున్న ఈ మూవీ..రెండు వారాలు కూడా పూర్తి కాక ముందే..తాజాగా ఆగస్ట్ 23న ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది.

ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ మూవీ ఎలాంటి ఆదరణ దక్కించుకోనుందో చూడాలి. ఈ ఏడాది లవ్ గురు మూవీతో డిజాస్టర్ ను టచ్ చేసిన విజయ్ ఆంటోనీ..తాజా తుఫాన్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయాడు. శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ,మేఘా ఆకాష్,మురళీ శర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. 

కథేంటంటే:

ఓ భారీ వర్షం కురిసిన రోజున భార్యను పోగొట్టుకొని..అప్పటినుండి వర్షానికి దూరంగా బతుకుతుంటాడు స‌లీం ( విజ‌య్ ఆంటోనీ). స‌లీం ఓ సీక్రెట్ ఏజెంట్‌. త‌న బాస్ (శ‌ర‌త్ కుమార్‌) అప్ప‌గించిన ఆప‌రేష‌న్ కోసం అండ‌మాన్ దీవుల్లో (ఓ ఊరిలో) ఒంటరిగా బ్రతుకుతుంటాడు. ఆ ఊరిలో డాలీ (డాలీ ధ‌నుంజ‌య‌) అనే వ‌డ్డీ వ్యాపారి చెప్పిందే వేదం. అత‌డి కార‌ణంగా ప్ర‌జ‌లు ఎన్నో ఇబ్బందులు ప‌డుతుంటారు. వారిలో చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన సౌమ్య(మేఘా ఆకాష్‌) కూడా ఉంటుంది. సౌమ్య‌తో స‌లీమ్‌కు ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా ఎలా మారుతుంది?

ALSO READ | Megha Akash: ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్

డాలీ బారి నుంచి ఆ ఊరి ప్ర‌జ‌ల‌ను స‌లీమ్ ఎలా కాపాడాడు? సౌమ్య కంటే ముందే స‌లీమ్ జీవితంలో ఉన్న మ‌రో అమ్మాయి ఎవ‌రు? ఆమె ఎలా ప్రాణాల‌ను కోల్పోయింది? అస‌లు స‌లీమ్..అండ‌మాన్‌కు ఎందుకొచ్చాడు.? ఈ క‌థ‌లో కెప్టెన్ (స‌త్య‌రాజ్‌) పాత్ర ఏంటీ? అనే తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.