విజయ్ ఆంటోనీ తుఫాన్ చిత్రం టీజర్‌‌‌‌ రిలీజ్

విజయ్ ఆంటోనీ తుఫాన్ చిత్రం టీజర్‌‌‌‌ రిలీజ్

డిఫరెంట్ కాన్సెప్టులతో బ్యాక్‌‌ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు విజయ్ ఆంటోనీ. తాజాగా ‘తుఫాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో  కమల్ బోరా, డి లలితా, బి ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈమూవీ టీజర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ ‘ఇదొక యాక్షన్ ప్యాక్డ్ మూవీ. అన్ని వర్గాల ఆడియెన్స్‌‌కు నచ్చుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేస్తాం’ అని చెప్పాడు.  డైరెక్టర్ విజయ్ మిల్టన్ మాట్లాడుతూ ‘ఒక దీవిలో జరిగే కథ ఇది.  అపరిచిత వ్యక్తి అపరిచిత సమాజంలోకి అడుగుపెట్టాక ఏమవుతుందనేది ఆసక్తికరంగా ఉంటుంది’ అని అన్నాడు. టీమ్ అంతా పాల్గొన్నారు.