కోలీవుడ్ హీరో, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ(Vijay antony) ఇంట తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన కూతురు మీరా ఆంటోనీ(Meera antony)(16) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఈ సంఘటనతో విజయ్ కుటుంబం కన్నీరు మున్నీరవుతున్నారు. వారి ఆవేదనను ఆపడం ఎవరితరం కావడంలేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు అనంతలోకాలు వెళ్లడంతో విజయ్ దంపతులు విలవిలలాడుతున్నారు.
ALSO READ : నిలోఫర్లో కిడ్నాప్ అయిన బాలుడు సేఫ్
The Force behind my strength,the consolations to my tears,the reason for my stress(Naughtiness super loaded)my Thangakatti-chellakutty. Meera Vijay Antony ,Congrats Baby
— Fatima (@mrsvijayantony) March 12, 2023
?❤️???? pic.twitter.com/yfTTdIiAjL
ఈ విషాద సమయంలో మీరా తల్లి ఫాతిమా పడుతున్న మానసిక క్షోభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సందర్బంగా గతంలో ఆమె తన కూతురు మీరా గురించి చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. నా బలం వెనుక శక్తి, నా కన్నీళ్ల వెనుక ఓదార్పు, నా ఒత్తిడికి కారణం, నా తంగకట్టి-చెల్లకుట్టి. కంగ్రాట్స్ బేబీ.. అంటూ పోస్ట్ లో రాసుకొచ్చారు ఫాతిమా. ఎంతో ఎమోషనల్ గా ఉన్న ఈ పోస్ట్ చూసి నెటిజన్స్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.