HATYA Movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ ఆంటోనీ హ‌త్య మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

HATYA Movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ ఆంటోనీ హ‌త్య మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

డిఫరెంట్ కథా చిత్రాలతో ఎప్పుడు ముందుంటాడు హీరో విజయ్ ఆంటోనీ(Vijay Antony).బిచ్చగాడు మూవీతో తెలుగు,తమిళ భాషల్లో మంచి హిట్ అందుకుని ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఇక రీసెంట్ గా (జూలై 21న) రిలీజైనా హ‌త్య(Hatya) మూవీలో విజయ ఆంటోని, మీనాక్షి చౌదరి, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమాపై ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికి మంచి కలెక్షన్లను వసూళ్లు చేసింది. 

లేటెస్ట్ గా ఈ మూవీ శుక్ర‌వారం (ఆగస్టు18న) ఓటీటీలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో చూడని వారు..ఓటీటీలో చూడటానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇక వీకెండ్ వస్తుండటంతో..హత్యకు అందరూ ఆకర్షితులు అవ్వడం కన్ఫర్మ్ అంటున్నారు మేకర్స్. ఇక హత్య మూవీ వివరాల్లోకి వెళ్తే..ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ మోడల్ లైలా(Meenakshi Chaudhary)ని ఎవరో హత్య చేస్తారు. హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకవు. దీంతో ఆమె మర్డర్ కేసుని డిటెక్టివ్ వినాయక్(విజయ్ ఆంటోని)తో పాటు ఐపీఎస్ ఆఫీసర్ సంధ్య(Ritika Singh) కలిసి దర్యాప్తు చేస్తారు. అంతిమంగా వీరి దర్యాప్తులో ఏం తేలింది? ఈ హత్యని ఎలా పరిష్కరించారు? అనేది సినిమా మెయిన్ స్టోరీ. 

విజయ్ ఆంటోనీ గత చిత్రాలు అన్నీ చాలా ఇంటెన్సివ్ యాక్షన్,క్రైమ్ జోనర్ లో రావడంతో..ఈ మూవీపై ప్రేక్షకులు ఓ లుక్కేయడానికి రెడీగా ఉన్నారు. ఈ మూవీని లోటస్ పిక్చర్స్‌(Lotus Pictures)తో కలిసి ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్(Infiniti Film Ventures) బ్యానర్‌పై కమల్ బోహరా మరియు లలితా ధనంజయన్ సంయుక్తంగా నిర్మించారు . ఈ మూవీ  IMDbలో 10కి 7.6 రేటింగ్‌లను పొందింది.