ఈఎన్​సీ(ఆపరేషన్స్​) గా విజయ్​ భాస్కర్ ​రెడ్డి

ఈఎన్​సీ(ఆపరేషన్స్​) గా విజయ్​ భాస్కర్ ​రెడ్డి

హైదరాబాద్​, వెలుగు: ఈఎన్​సీ (ఓ అండ్​ఎం)గా విజయ్​ భాస్కర్​ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం నాగర్​కర్నూల్​ ఇన్​చార్జి సీఈగా పనిచేస్తున్న ఆయనకు ఈఎన్​సీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు బుధవారం ఇరిగేషన్​ శాఖ సెక్రటరీ రాహుల్​బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ఈఎన్​సీ నాగేందర్ రావు స్థానంలో విజయ్​ భాస్కర్​ రెడ్డి కొనసాగుతారు. వాస్తవానికి ఆగస్టులోనే నాగేందర్​రావు రిటైర్​అవ్వగా.. ఆయనకు మూడు నెలల పాటు సర్కారు ఎక్స్​టెన్షన్​ ఇచ్చింది. నవంబర్​ 30తో ఎక్స్​టెన్షన్​ గడువు ముగిసింది. ఈ సారి ఎక్స్​టెన్షన్​ ఇవ్వకుండా విజయ్​భాస్కర్​ రెడ్డిని నియమించింది.