విజయ్ మూవీ బిగ్ అప్డేట్.. త్వరలో టైటిల్ అండ్ ఫస్ట్ లుక్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ నుండి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు(Dil raju) నిర్మిస్తున్న ఈ సినిమాలో సీతరామమ్ ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal thakur) హీరోయిన్ గ నటిస్తుండగా.. పరశురామ్(Parasuram) పెట్ల దర్శకతం వహిస్తున్నారు. పరశురామ్, విజయ్ కాంబోలో లో వచ్చిన గీతగోవిందం మూవీ ఎంత పెద్ద సక్సెస అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి. 

Also Read : లియో ఈవెంట్ క్యాన్సిల్.. పొలిటికల్ ప్రెజర్ లేదు.. షాకిచ్చిన మేకర్స్

 
ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ సినిమా అప్పుడే సగం షూటింగ్ కంప్లీట్ చేసుకొని.. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసుకుంది. ఈ సినిమాను 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఇదే విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు త్వరలోనే టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయనున్నట్లు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఈ అప్డేట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా కూడా గీతగోవిందం రేంజ్ లో భారీ సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి.