
రష్మిక, విజయ్ దేవరకొండ డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ జంట తమకు తాముగా ఈ వార్తలపై డైరెక్ట్గా ఎప్పుడు స్పందించలేదు. కానీ, మేం ఒక్కటవ్వబోతున్నాం అనేలా ఫోటోలు షేర్ చేస్తూ.. వైరల్ గా నిలుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్గా ఈ జంట సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. మరి ఈ సారి ఎటువంటి ఫొటోస్ షేర్ చేశారు? ఎక్కడ కలుసుకున్నారో? ఓ లుక్కేద్దాం.
Also Read:-ఆడిషన్ కి వెళితే నల్లగా ఉన్నావంటూ అవమానించారు...
నేషనల్ క్రష్ రష్మిక ఏప్రిల్ 5న, రష్మిక తన 29వ పుట్టినరోజును ఒమన్‌లో జరుపుకుంది. ఈ సందర్భంగా ఒమన్‍లోని ఓ బీచ్‍లో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, విజయ్ దేవరకొండ సైతం ఒక్కరోజు గ్యాప్ లోనే బీచ్‌సైడ్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఇక ఇద్దరు పోస్ట్ చేసిన ఫొటోల్లో బీచ్ ఒకేలా కనిపించడంతో, కలిసి బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్నారనే రూమర్లు ఇప్పుడు బయటకు వచ్చాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ జంట బర్త్ డే సెలెబ్రేషన్స్ తో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.
విజయ్ పోస్ట్ చేసిన ఫోటోలలో, పూర్తిగా తెల్లటి లినెన్ దుస్తులను ధరించాడు. అక్కడ ఎండలో తడిసి సముద్రం పక్కన గుర్రపు స్వారీ చేస్తూ కనిపిస్తున్నాడు. "గుర్రాలపై స్వారీ చేయడం మరియు బరీఫీట్‌లో జీవించడం" అనే క్యాప్షన్‌తో ఫోటోలను షేర్ చేశాడు. రష్మిక షేర్ చేసిన ఫొటోస్ లో తనలోని ఆనందానికి అర్ధం విజయ్ దేవరకొండ అనేలా నవ్వుతూ కనిపిస్తుంది.
ప్రస్తుతం వీరిద్దరూ పోస్ట్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో రష్మికకు తమ ఫ్యాన్స్ బర్త్ డే విషెస్ చెబుతున్నారు. విజయ్, రష్మిక అనుకోకుండా హింట్స్ ఇస్తున్నారా..అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి వీరిద్దరూ నిజంగానే కలిసి ఒమన్ బీచ్ వెకేషన్ కి వెళ్ళారా? లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
గతంలో విజయ్ రష్మిక కలసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలసి నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరిమధ్య ప్రేమ చిగురించిందని అప్పటి నుంచి పర్సనల్ లైఫ్ లో చాలా క్లోజ్ గా ఉంటున్నారని, అంతేగాకుండా ఇరువురి ఇళ్ళలో జరిగే ఫంక్షన్స్ కి కుటుంబ సభ్యులు కూడా హాజరవుతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం రష్మిక మందన పుష్ప 2, ఛావా సినిమాల సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. హిందీ, తమిళ్, తెలుగు తదితర భాషలలో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం డైరక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. వీటితో పాటు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గర్ల్ ఫ్రెండ్ మూవీలో ఇంపాక్ట్ రోల్ ప్లే చేస్తోంది.
విజయ్ దేవరకొండ విషయానికొస్తే.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్‍డమ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాని టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. అలాగే కల్కి 2, శ్యామ్ సింగరాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతోంది. పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో విజయ్ యోధుడిగా కనిపిస్తాడని టాక్. ఆ తర్వాత రవికిరణ్ కోలాతో ఓ సినిమా చేస్తున్నాడు.