ఖుషీ.. టైటిల్ కు తగ్గట్టు ఖుషీ.. ఖుషీగా ఉంది ట్రైలర్. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషీ మూవీ ట్రైలర్.. పక్కా ఫ్యామిలీ ఎంటర్ ట్రైనర్ గా ఉంది. యూత్ లవ్ అండ్ న్యూ మ్యారేజ్ మధ్య ఉండే గ్యాప్.. ప్రేమ పెళ్లి తర్వాత వచ్చే గొడవలతో ఈ ట్రైలర్ కు మంచి హైప్ వచ్చింది.
కాశ్మీర్ లో మొదలయ్యే ప్రేమతో క్యూరియాసిటీ పెంచారు. బేగం కాదు.. బ్రాహ్మిణ్ అంటూ క్యాస్ట్ ట్విస్ట్ తోపాటు.. ముహూర్తాలు, జాతకాలతో ముడిపెట్టి.. లవ్ మ్యారేజ్ చూపించారు ట్రైలర్ లో.. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ – సమంత మధ్య జరిగే గొడవలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను టచ్ చేశారు.
పెళ్లంటేనే చావు రా.. నువ్వు ఎప్పుడో చచ్చిపోయావ్.. భర్త అంటే ఎలా ఉంటాడో చూపిస్తా లాంటి యూత్ ఫుల్ డైలాగ్స్ తోపాటు.. నీతో మాట్లాడాలంటేనే భయమేస్తుంది విప్లవ్ అంటూ సమంత చెప్పే డైలాగ్స్ తో.. డెప్త్ కనిపిస్తుంది.
విజయ్ దేవరకొండ – సమంత జోడీ అయితే స్క్రీన్ పై కిర్రాక్ గా ఉంది. చూడముచ్చటగా ఉందనేది ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతుంది. గీత గోవిందం తర్వాత ఫుల్ లెన్త్ ఫ్యామిలీ కథతో వస్తున్న ఖుషీ సినిమా ట్రైలర్ అయితే బాగుందనే టాక్ వచ్చింది.. ఇక మూవీ ఎలా ఉంటుందో చూడాలి..
తెలుగుతో పాటు తమిళం, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది ఈ సినిమా. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ ముఖ్య పాత్రల్లో నటించారు.