రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇప్పటికే ఆయన గీతగోవిందం(Geetha Govindam) దర్శకుడు పరశురామ్(Parasuram) తో ఒక సినిమా, జెర్సీ(Jersy) దర్శకుడు గౌతం తిన్ననూరి(Goutham thinnanuri)తో ఒక సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్ షెరవేగంగా జరుగుతోంది. ఈ రెండు సినిమాలే కాకుండా.. ఇప్పుడు మరొక సినిమాకు ఒకే చెప్పేశాడట విజయ్.
ALSO READ: ప్రీతమ్ జుకల్కర్‌కు..సమంత స్పెషల్ గిఫ్ట్..ఎంత మురిసిపోయాడో
ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil raju) నిర్మాణంలో రానున్న ఈ సినిమాకి రాజా వారు రాణి గారు(Rajavaru ranigaru) చిత్ర రవికిరణ్ కోలా(Ravikiran kola) దర్శకత్వం వహించనున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన కథ చర్చలు పూర్తయ్యాయని సమాచారం. ఫైనల్ స్క్రిప్ట్ చూశాక దిల్ రాజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట. అదే రేంజ్ లో రెస్పాండ్ అయ్యాడట విజయ్ దేవరకొండ. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకు యుద్ధం అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నారట మేకర్స్.
కారణం ఈ సినిమా అంతా 1980 మాఫియా నేపధ్యంలో సాగుతుందట అందుకే ఈ సినిమాకు యుద్ధం అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేయనున్నారని తెలుస్తోంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో విజయ్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండనుందని టాక్. అంతేకాదు మునుపెన్నడూ కనిపించని సరికొత్త అవాతారంలో కనిపించనున్నాడట విజయ్. మరి టైటిల్ తోనే ఆసక్తిని పెంచుతున్న ఈ ప్రాజెక్టు ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.