స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ (FamilyStar). సీతారామం (Sitaramam) ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ (SVC54) పై దిల్ రాజు(Dil raju) నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు.
ఈ నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్ ఓటీటీ డీల్ పై ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. ఫ్యామిలీ స్టార్ విషయంలో నిర్మాత దిల్ రాజుకు ఓటీటీ డీల్స్ భారీగానే సెట్ అయినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన సేఫ్ అని టాక్ నడుస్తోంది. ఫ్యామిలీ స్టార్ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. త్వరలో ఈ న్యూస్ ఆఫీసియల్ గా ప్రకటించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.
ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చిన 45 రోజుల తర్వాత రాబోతుందని టాక్ నడుస్తోంది. ఒకవేళ సినిమా పెద్ద ఎత్తున హిట్ కొట్టలేక, వసూళ్లు రాబట్టుకోలేక పోతే మాత్రం నెల రోజుల్లోపే వచ్చే ఛాన్స్ ఉందని కూడా తెలుస్తోంది.తాజాగా ఫ్యామిలీ స్టార్ ఓటీటీ డీల్ కూడా సెట్ అవ్వడంతో..ఇక థియేట్రికల్ బిజనెస్‌పై ప్రొడ్యూసర్స్ ఫోకస్ చేశారట. మరి ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ లెవల్లో జరగనుందో చూడాలి.
ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్, టీజర్,సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన గీతగోవిందం సక్సెస్ రిపీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
ALSO READ :- మార్చి 20నుంచి తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు
అంతేకాదు ఈ సినిమాతో విజయ్ హిట్ కొడితేనే..సినిమా కెరీర్ కు ప్రాణం పోసినంత హెల్ప్ అవుతుంది. మరి ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి. ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో 54వ చిత్రంగా ఫ్యామిలీ స్టార్ రూపొందడం విశేషం.