Vijay Devarakonda: వైజాగ్లో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మీట్.. మనోడి క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవల్

Vijay Devarakonda: వైజాగ్లో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మీట్.. మనోడి క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవల్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తన ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చాడు. తాజాగా వైజాజ్ లో ఫ్యాన్స్ మీట్(Fans meet) నిర్వహించాడు.  వైజాగ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ స్వయంగా వెళ్లి తన అభిమానులను కలుసుకున్నాడు. ఇక విజయ్ వస్తున్నాడని తెలియడంతో ఆ ప్రాంతం అంతా అభిమానులతో నిండిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన జెర్సీ ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఈ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారని సమాచారం. పీరియాడికల్ డ్రామాగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. విజయ్ మొదటిసారి పోలీస్ పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతంలో జరుగుతోంది. ఆ కారణంగానే వైజాగ్ లో జరిగిన ఫాన్స్ మీట్ కి హాజరయ్యారు విజయ్ దేవరకొండ.