
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. వాటిలో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ‘కింగ్‌డమ్’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూట్ కోసం శ్రీలంక వెళ్లాడు విజయ్. ఈ షెడ్యూల్‌లో ఓ లవ్ సాంగ్‌ను చిత్రీకరించనున్నట్టు టీమ్ తెలియజేసింది. వారం రోజులపాటు ఈ షెడ్యూల్ జరగనుందని చెప్పారు. శ్రీలంక వెళ్లిన విజయ్ ఎయిర్ పోర్ట్ పిక్స్ వైరల్ అయ్యాయి. రౌడీ ట్రెండీ సమ్మర్ వేర్‌లో స్టైల్ ఐకాన్‌గా కనిపించాడు విజయ్.
రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘కింగ్‌డమ్’ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏఐ వీడియోతో రిలీజ్ చేసిన టీజర్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ సినిమాపై ఆసక్తిని పెంచింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మే 30న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.