![KINGDOM Teaser: మొత్తం తగలబెట్టేస్తా అంటున్న విజయ్ దేవరకొండ..](https://static.v6velugu.com/uploads/2025/02/vijay-devarakonda-kingdom-movie-teaser-out_Wemtg9LU6X.jpg)
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి క్రేజీ కాంబినేషన్ లో వస్తన్న సినిమా VD12 (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా చివరి షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తమిళ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి గతంలో లీక్ అయిన కొన్ని ఫోటోలు ఒక్కసారిగా హైప్ పెంచేసాయి. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఈ సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ విజయ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. ఈరోజు యూట్యూబ్ లో విజయ్ దేవరకొండ కింగ్డమ్ టీజర్ రిలీజ్ చేశారు.
ఇప్పుడు ఈ టీజర్ విశేషాలేంటో చూద్దాం.. మొదటగా సముద్రం ఒడ్డున మంటలో గన్ ఫైరింగ్ విజువల్స్ తో గాంభీర్యమైన వాయిస్ తో అలసట లేని భీకర యుద్ధం.. అనే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. ఆతర్వాత ఇసుక దిబ్బల్లో రక్తపు మడుగులో శవాలతో ఎమోషన్స్ సీన్స్.. ఇక సగం టీజర్ తర్వాత విజయ్ దేవరకొండ ఎంట్రీ ఉంటుంది. ఆ ఆతర్వాత కొన్ని జైలు సన్నివేశాలు, కోయజాతి వారితో ఫైట్స్ సీన్స్ ఇవన్నీ కూడా టీజర్ పై ఆసక్తిని పెంచాయి. టీజర్ మొత్తం విజయ్ దేవరకొండ యాక్షన్ సీన్స్ మాత్రమే ఉన్నాయి. చివరలో అవసరమైతే తగలబెట్టేస్తా సార్.. అంటూ చెప్పే డైలాగ్ తో ఎండ్ అవుతుంది.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ షార్ట్ హెయిర్ తో అయితే టీజర్ మొత్తానికి ఎన్టీఆర్ వాయిస్ మంచి ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు. ఇక అనిరుద్ మ్యూజిక్ బీజియం యాక్షన్ సీన్స్ కి తగ్గట్టుగా సూపర్ గా సెట్ అయ్యింది. ముఖ్యంగా విజయ్ జైలులో ఉన్నప్పుడు వచ్చే సీన్స్ కి గూస్ బంప్స్ వస్తుంది. ఓవరాల్ గా చూస్తే యాక్షన్ అండ్ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో కట్ చేసిన టీజర్ కింగ్డమ్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 30న రిలీజ్ కాబోతోంది.