రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నటిస్తున్న లేటెస్ట్ మూవీస్లో..మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నది VD12 అని చెప్పుకోవాలి. కారణం ఈ సినిమాకు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Goutham Thinnanuri) కావడమే. ఈ దర్శకుడి నుండి వచ్చిన మళ్ళీ రావా, జెర్సీ సినిమాలు ఆడియన్స్ను అలరించాయి. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో తీస్తున్న ఈ మూవీలో విజయ్ దేవరకొండ గూఢచారి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.
Also Read :- భారీ స్థాయిలో డబుల్ ఇస్మార్ట్
ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ నుండి క్రేజీ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. అయితే విజయ్‌కు సంబందించిన ఓ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బైక్‌పై వెనకాల కూర్చొని తీక్షణంగా చూస్తున్న నయా లుక్ అదిరిపోయింది. గడ్డం, షార్ట్ హెయిర్ స్టైల్‌లో రగ్డ్ లుక్తో గుర్తుపట్టలేకుండా ఉన్నాడు. ఇది చూసిన నెటిజెన్స్.. ‘ఎలా ఉండే వాడు.. ఎలా అయ్యాడు’, ‘ఇక బడా దేవరకొండను గుర్తుపట్టడం కష్టమే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో దేవరకొండ ఫ్యాన్స్ కి ఉపశమనం కలిగిస్తోంది. ప్రస్తుతం విజయ్ పరిస్థితి చాలా అయోమయంలో ఉందనే చెప్పుకోవాలి. ఇక గత సినిమాల ప్రభావం లేకుండా VD 12 వస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఏమవుతుందో చూడాలి.
#VijayDeverakonda's new movie getup leaked 🥵😍#VD12 pic.twitter.com/Ki5Mkkq9TA
— 𝙂𝙖𝙣𝙜𝙨𝙩𝙚𝙧 𝙂𝙖𝙣𝙚𝙨𝙝 🗿 (@GaneshDGangster) July 23, 2024
అయితే, ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో హైప్ భారీ స్థాయిలో ఉంది. అందుకు కారణం లేకపోలేదు. అనిరుధ్ సినిమా అంటే..అదిరిపోయే సాంగ్స్, బీజీమ్స్, బిట్ సాంగ్స్ ఉంటాయి. VD 12ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడ్యూసర్ నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) హీరోయిన్ గా నటిస్తుంది.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన హీరో నాని (Nani) తీసిన చిత్రం జెర్సీ (Jersey).2019లో రిలీజైన జెర్సీ సినిమా భారీ విజయాన్ని సాధించి,ఇప్పటివరకు అనేక అవార్డులు గెలుచుకుంది.ఒక్కో సాంగ్ చార్ట్ బ్లాస్టర్ అవ్వడంతో ఇప్పటికీ ఈ సినిమాపై హైప్ నెక్స్ట్ లెవల్లో ఉంది. మరి ఇలాంటి కాంబోలో వస్తోన్న VD 12 ఎలా ఉండనుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
#VD12
— gowtam tinnanuri (@gowtam19) January 13, 2023
This one is special with @TheDeverakonda
Produced by @vamsi84 & #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/IXM8uCoXxE