![Happy Birthday Vijay Devarakonda: కత్తి నేనే…నెత్తురు నాదే.. యుద్దం నాతోనే అంటున్న విజయ్ దేవరకొండ](https://static.v6velugu.com/uploads/2024/05/vijay-devarakonda-new-movie-poster-released_y7BfO2Qdn3.jpg)
రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) కొత్త సినిమాను ప్రకటించాడు. కొన్నిరోజుల క్రితమే అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్టు నుండి తాజాగా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. మే 9 విజయ్ దేవరకొండ పుట్టినరోజు సంధర్బంగా ఈ పవర్ ఫుల్ పోస్టర్ విడుదల చేశారు. మొత్తం ఎరుపురంగులో ఉన్న ఈ పోస్టర్ చేతిలో కత్తి పట్టుకొని ఉన్నట్టుగా ఉంది. ఆ పోస్టర్ పై కత్తి నేనే…నెత్తురు నాదే.. యుద్దం నాతోనే అనే పవర్ ఫుల్ కొటేషన్ యాడ్ చేశారు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
“The blood on my hands is not of their death.. but of my own rebirth..“
— Vijay Deverakonda (@TheDeverakonda) May 9, 2024
Ravi Kiran Kola X Vijay Deverakonda@SVC_official pic.twitter.com/xGXXiNbVQu
పాన్ ఇండియా లెవల్లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రాజావారు రాణివారు ఫేమ్ రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తుండగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన నటీనటులు, టెక్నీషియన్స్ డీటెయిల్స్ త్వరలోనే ప్రకటించనున్నారు. ఇవన్నీ చూస్తుంటే విజయ్ ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సాధిస్తాడని నమ్మకం కలుగుతోంది.