VD12: భీకరమైన లుక్తో విజయ్ దేవరకొండ..VD 12 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

VD12: భీకరమైన లుక్తో విజయ్ దేవరకొండ..VD 12 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నటిస్తున్న లేటెస్ట్ మూవీస్లో..మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నది VD12 అని చెప్పుకోవాలి. కారణం ఈ సినిమాకు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Goutham Thinnanuri) కావడమే. ఈ దర్శకుడి నుండి వచ్చిన మళ్ళీ రావా, జెర్సీ సినిమాలు ఆడియన్స్ను అలరించాయి.

ఇన్నోవేటివ్‌ కాన్సెప్ట్‌తో తీస్తున్న ఈ మూవీలో విజయ్‌ దేవరకొండ గూఢచారి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.  ఈ సినిమా దాదాపు 60 శాతం వరకు చిత్రీకరణ పూర్తయింది.కానీ,ఇప్పటికీ VD 12 నుండి అనౌన్స్ మెంట్ పోస్టర్ తప్ప మరెలాంటి అప్డేట్ రాలేదు. 

తాజాగా VD 12 నుంచి అదిరిపోయే పోస్టర్ తో గూస్బంప్స్ రేపే క్యాప్షన్ తో ప్రొడ్యూసర్ నాగవంశీ అప్డేట్ ఇచ్చాడు. ఈ తాజా పోస్టర్లో విజయ్ దేవరకొండ భీకరమైన లుక్లో వర్షంలో తడుస్తూ..ముఖంపై రక్తం కారుతున్నట్లుగా కనబడుతున్నారు. అలా కారుతున్న నెత్తురుతో కోపంతో కూడినగంభీరమైన అరుపుతో ఆకాశంలో చూస్తూన్నాడు. 

ఈ పోస్టర్కి నిర్మాత నాగవంశీ "అతని విధి అతని కోసం వేచి ఉంది. తప్పులు..రక్తపాతం..ప్రశ్నలు..పునర్జన్మ" అంటూ విభిన్నమైన క్యాప్షన్ తో సినిమాపై ఆసక్తి రేపారు. ఇక ఈ పోస్టర్ చూసాక దేవరకొండకు సాలిడ్ హిట్ ఖాయం అంటూ సినీ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  ఎందుకంటే, ప్రస్తుతం విజయ్ పరిస్థితి చాలా అయోమయంలో ఉందనే చెప్పుకోవాలి. ఇక గత సినిమాల ప్రభావం లేకుండా VD 12 వస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఏమవుతుందో చూడాలి.

ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కావడంతో హైప్ భారీ స్థాయిలో ఉంది. అందుకు కారణం లేకపోలేదు. అనిరుధ్ సినిమా అంటే..అదిరిపోయే సాంగ్స్, బీజీమ్స్, బిట్ సాంగ్స్ ఉంటాయి. VD 12ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడ్యూసర్ నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ 2025 మార్చి 28న థియేటర్లలో రిలీజ్ కానుంది.