బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తన 12వ చిత్రంలో నటిస్తుండగా, రవి కిరణ్ కోలా దర్శకత్వంలో 13వ సినిమా చేస్తున్నాడు. అలాగే తన 14వ మూవీ రాహుల్ సంకృత్యన్‌తో కమిట్ అయ్యాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ను ప్రకటించారు మేకర్స్. ‘వీడీ 14’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యిందని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలియజేశారు.
రిపబ్లిక్ డే సందర్భంగా సెట్ వర్క్ ప్రారంభించినట్టు చెప్పారు. ఈ సినిమా బ్రిటీష్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని, 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నామన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘టాక్సీవాలా’ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.