సినీనటుడు విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులు, ఖుషి మూవీ టీంతో కలిసి ఆదివారం(సెప్టెంబర్ 03) యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా విజయ్ దేవరకొండ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం పండితులు విజయ్ దేవరకొండకు వేదాశీర్వచనాలు ఇచ్చారు. విజయ్ దేవరకొండను చూడడానికి కొండపైకి ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు.
కాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ఖుషి. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి పాజిటీవ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఎగబడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు తొలిరోజు రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయని టాక్.
ఇక విజయ్ గత చిత్రం లైగర్, సమంత గత చిత్రం శాకుంతలం ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. అందుకే ఈ ఇద్దరి కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేశారు. ఈ క్రమంలో వచ్చిన సినిమానే ఖుషి. ఇక ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ తో పాటు, వాళ్ళ ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు.