రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) సౌత్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఖుషి(Kushi) థియేటర్లలోకి వచ్చేసింది. క్లాస్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ(Shiva nirvana) తెరకెక్కించిన ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా... సెప్టెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమాకు కూడా ఆడియన్స్ నుండి పాజిటీవ్ టాక్ వస్తోంది. సినిమా చాలా బాగుంది, విజయ్ అన్న హిట్టు కొట్టేశాడు, విజయ్ సమంతల కెమిస్ట్రీ చాలా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఖుషి సినిమాకు వస్తున్న పాజిటీవ్ రెస్పాన్స్ పై చాలా ఎమోషనల్ గా స్పదించాడు హీరో విజయ్ దేవరకొండ.
?
— Vijay Deverakonda (@TheDeverakonda) September 1, 2023
You all waited for 5 years, with me. Patiently waiting for me to do my thing! We did it. Today!! :)
Waking up to this happiness from all around and my phone to hundreds of messages.
I cannot help but tear up with emotions. I love you all ❤️
Go and enjoyyyyy this one with…
గతేడాది రిలీజైన విజయ్ నుండి వచ్చిన లైగర్ బోల్తా కొట్టడంతో.. ఖుషిపై చాలా ఆశలు పెట్టుకున్నాడు విజయ్. అందుకు తగ్గట్టుగానే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మూవీ రిజల్ట్ పై ఫస్ట్ రియాక్షన్ ఇచ్చేశాడు విజయ్.. నాతో పాటు మీరు కూడా ఐదేళ్లుగా ఎదురుచూశారు. మొత్తానికి ఈ రోజు మన ఎదురుచూపులు నిజమయ్యాయి. మనం సాధించాం. వందల ఫోన్ కాల్స్, వేల మెసేజులతో నిద్రలేచాను. కన్నీళ్లు ఆగడంలేదు.. లవ్ యూ ఆల్. అందరు సినిమాను ఎంజాయ్ చేయండి. మీ విజయ్ దేవరకొండ అంటూ ట్వీట్ చేశాడు విజయ్. ప్రస్తుతం విజయ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.