![పవర్ ఫుల్ టైటిల్ తో విజయ్ దేవర కొండ కొత్త మూవీ](https://static.v6velugu.com/uploads/2025/02/vijay-devarakondas-kingdom-teaser-violent-action_Kv6RA1fJXx.jpg)
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. బుధవారం ఈ మూవీ టైటిల్‌ను ప్రకటించారు. ‘కింగ్డమ్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేయడంతో పాటు టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ తెలుగు వెర్షన్‌కు జూనియర్ ఎన్టీఆర్, తమిళ వెర్షన్‌కు సూర్య, హిందీ వెర్షన్‌కు రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ప్యాక్డ్ విజువల్స్‌తో ఈ టీజర్ కట్ చేశారు. అణచి వేయబడ్డ ప్రజలకు అండగా నిలిచే నాయకుడి తరహాలో విజయ్ పాత్రను చూపించారు.
‘‘అలసట లేని భీకర యుద్ధం... అలలుగా పారే వీరుల రక్తం... వలసపోయిన, అలసిపోయిన ఆగిపోనిది ఈ మహా రణం. నేలపైన దండయాత్రలు.. మట్టికింద మృతదేహాలు. ఈ అలజడి ఎవరికోసం.. ఇంత బీభత్సం ఎవరికోసం.. అసలు ఈ వినాశనం ఎవరికోసం.. రణభూమిని చీల్చుకుని పుట్టే కొత్తరాజు కోసం.. కాల చక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం..” అంటూ ఎన్టీఆర్ గంభీరంగా చెప్పిన వాయిస్‌తో విజయ్ పాత్రను పరిచయం చేసిన తీరు ఇంప్రెస్ చేసింది. అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మే 30న సినిమా విడుదల కానుంది.