మృణాల్​కు విజయ్​ దేవరకొండ్​ సర్​ప్రైజ్

మృణాల్​కు విజయ్​ దేవరకొండ్​ సర్​ప్రైజ్

టాలీవుడ్​ హీరోయిన్​ మృణాల్​ ఠాకూర్(Mrunal Thakur)​ విజయ్​ దేవరకొండ(Vijay devarakonda)తో ఓ సినిమాలో నటిస్తోంది. గీతగోవిందం(Getha Govindam) ఫేం పరశురాం(Parashuram) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ సెట్స్​లో విజయ్​ దేవరకొండ ఈ నటికి స్వీట్​ సర్​ప్రైజ్​ ఇచ్చాడు. నిన్న మృణాల్​ తన బర్త్​డేను జరుపుకుంది. ఈ నేపథ్యంలో మూవీ సెట్స్​లో కేక్​ కటింగ్​ ప్లాన్​ చేశారు. ఇందులో మూవీ టీం అంతా పాల్గొంది.
 

వేరే షూటింగ్​ పనుల్లో బిజీగా ఉన్న విజయ్​.. తమ సినిమా హీరోయిన్​ కోసం టైం కేటాయించి రావడం ఫ్యాన్స్​ను ఆకట్టుకుంటోంది. వీరిద్దరి జోడీని తెరపై చూసేందుకు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గీతగోవిందంతో రష్మిక(Rashmika)కు ఓవర్​నైట్​ స్టార్​డం తెచ్చిన ఈ డైరెక్టర్​ ఇప్పుడీ బ్యూటీ కోసం ఇంట్రెస్టింగ్​ క్యారెక్టర్​ను రాశాడట. మరోవైపు నాని(Nani)తో నటిస్తున్న ‘హాయ్​ నాన్న(Hi Nanna)’ మూవీ నుంచి మృణాల్​ పోస్టర్​ విడుదలైంది.