
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ రిటైల్ చెయిన్విజయ్సేల్స్సౌతిండియన్యాక్టర్ విజయ్‌దేవరకొండను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఆయన ప్రచారం వల్ల మార్కెట్లో మరింతగా ఎదుగుతామని తెలిపింది. సౌతిండియాలో విజయ్‌కు ఎంతో పాపులారిటీ ఉందని, ఆయన తమతో కలసి పనిచేయడం వల్ల యువత విజయ్సేల్స్కు దగ్గర అవుతారని కంపెనీ డైరెక్టర్ నీలేశ్ గుప్తా అన్నారు. ప్రొడక్టు లాంచ్‌లు, డిజిటల్ క్యాంపెయిన్లు, స్పెషల్కస్టమర్ ఎంగేజ్మెంట్ వంటి ప్రోగ్రామ్స్‌లో ఆయన పాల్గొంటారని తెలిపారు. టీవీలు, ఫోన్లు, ఏసీల వంటి ఎలక్ట్రానిక్వస్తువులు అమ్మే విజయ్సేల్స్కు దేశవ్యాప్తంగా 150 స్టోర్లు ఉన్నాయి.