VijayRashmika: రష్మిక మందన్నకు సహాయం చేయని విజయ్ దేవరకొండ.. నెటిజన్స్ ఫైర్

VijayRashmika: రష్మిక మందన్నకు సహాయం చేయని విజయ్ దేవరకొండ.. నెటిజన్స్ ఫైర్

విజయ్ దేవరకొండ, రష్మిక (Vijay Rashmika) సెలబ్రెటీ రూమర్ కపుల్స్గా మారిపోయారు. కొంతకాలంగా వీరిపై డేటింగ్ రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. వారి రిలేషన్ షిప్పై రూమర్స్ వస్తూనే ఉన్నా ఈ జంట ఎప్పడు పెదవి విప్పలేదు.

లేటెస్ట్గా ఈ జంట మరోసారి కెమెరా కంటికి చిక్కి వార్తల్లోకెక్కారు. హైదరాబాద్లో విజయ్, రష్మిక కలిసి జిమ్ నుంచి బయటకి వస్తోన్న వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, ఈ వీడియోపై నెటిజన్స్ నుంచి భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ముందుగా జిమ్ నుంచి కారు ఎక్కడానికి విజయ్ బయటికి వచ్చాడు. గాయపడిన రష్మికకు విజయ్ సహాయం చేయకుండా బయటికి రావడంపై రష్మిక ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రష్మికకు అవసరమైన సమయంలో విజయ్ ఎందుకు తన సపోర్ట్ అందించలేదని ప్రశ్నిస్తూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read :- రిలీజ్‌కు ముందే అజిత్ మూవీ రికార్డులు

అంతేకాదు ఈ వీడియో వైరల్ అయిన వెంటనే, అనేక మంది సోషల్ మీడియాలో విజయ్‌ను ట్యాగ్ చేస్తూ "ఇంటెన్సివ్" అని కామెంట్స్ చేశారు. మరికొందరు "సహాయం చేయి" అని పోస్ట్ చేశారు. "ఆమె కారు ఎక్కడానికి కూడా డ్యూడ్ సహాయం చేయలేకపోయాడా?! పాపం," అని మరికొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేశారు.

ఇటీవలే రష్మిక మందన్న జిమ్‌లో వర్కవుట్ చేస్తూ కాలికి బలమైన గాయమైన విషయం తెలిసిందే. తగిలిన గాయంతో రష్మిక తెగ ఇబ్బంది పడుతూ తన హిందీ మూవీ ప్రమోషన్స్ సైతం పాల్గొని శభాష్ అనిపించుకుంది.

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న ఈ హిస్టారికల్ మూవీలో రష్మిక సంభాజీ మహారాజ్ భార్య మహారాణి యసుబాయ్ పాత్రలో కనిపించనుంది. తెలుగులో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గర్ల్ ఫ్రెండ్ మూవీలో నటిస్తుంది.