విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ (FamilyStar). సీతారామం(Sitaramam) ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal thakur) హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబోలో ఇప్పటికే గీతగోవిందం సినిమా వచ్చి సూపర్ హిట్ ఐన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.
అయితే తాజా సమాచారం ప్రకారం..ఫ్యామిలీ స్టార్ షూటింగ్ ప్రస్తుతం కూకట్‌పల్లిలో లేటెస్ట్ షెడ్యూల్ కొనసాగుతోంది. ఫ్యామిలీ మ్యాన్‌లా లుంగీ, టీ షర్ట్ వేసుకున్న విజయ్ దేవరకొండపై ఛేజింగ్ సీక్వెన్స్ మేకర్స్ షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్య తరగతి కుర్రాడిగా కనిపిస్తోన్న విజయ్ దేవరకొండను చూడటానికి భారీగా అభిమానులు షూటింగ్ స్పాట్కి వచ్చేసినట్టు సమాచారం. అయితే రీసెంట్గా కొన్ని సీన్లను హైదరాబాద్‌లోని Woxsen Universityలో చిత్రీకరించినట్టు తెలుస్తోంది.
#VijayDeverakonda at Woxsen University#FamilyStar https://t.co/z9i0HTc8BX pic.twitter.com/n6Pn9V5wvu
— FamilyStar ? (@FamilyStarMovie) February 1, 2024
ఇటీవల రిలీజైన టీజర్తో ఫ్యామిలీ స్టార్ మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ టీజర్ లో ఐరనే వంచాలా ఏంటి? అని విజయ్ చెప్పిన డైలాగ్ ఎంత ట్రెండ్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే డైలాగ్ దర్శనమిచ్చింది. దీంతో సినిమా ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ గ్లింప్స్..అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను, ఓ వైపు కుర్రాళ్లను భలే ఆకట్టుకుంది.
also read :- తమన్నాతో పెళ్లి ఎప్పుడు?..విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఈ మూవీలో విజయ్ లుక్, తెలంగాణ స్లాంగ్లో వచ్చే డైలాగ్స్ ఎంతో అట్రాక్షన్ గా ఉండబోతున్నట్లు టాక్. ఉల్లిపాయలు కొంటె ఆడు మనిషి కాదా..పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా..అనే డైలాగ్స్ అయితే..థియేటర్లో విజిల్స్ పడేలా ఉన్నాయి. ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీ మార్చి 22న రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.