స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ (FamilyStar). సీతారామం(Sitaramam) ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal thakur) హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ (SVC54) పై దిల్ రాజు (Dil raju) నిర్మిస్తున్నారు.
రీసెంట్గా ఫ్యామిలీ స్టార్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో విజయ్ లుక్, తెలంగాణ స్లాంగ్లో వచ్చే డైలాగ్స్ ఎంతో అట్రాక్షన్ గా ఉన్నాయి.మధ్య తరగతి కుర్రాడిలా..పక్కింటి అబ్బాయిలా ఆకట్టుకుంటున్నాడు.
అయితే ఫ్యామిలీ స్టార్ టీజర్లో ఓ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అదేనండీ..ఈ టీజర్లో అభినయకు విజయ్ దేవరకొండ దోశ వేసే సీన్ ఒకటి ఉంది.పెనంపై అతడు దోశ వేసి అభియన ప్లేట్‍లో వడ్డిస్తాడు. అయితే, దీన్ని బాగా పరిశీలించిన నెటిజన్స్..అసలు అది దోశలా లేదని గుర్తించారు.
నిజానికి విజయ్ దేవరకొండ వేసిన ఆ దోశ గుండ్రంగా కాకుండా చతురస్రంగా ఉంది.అంతేకాదు చూసేందుకు అది పేపర్‌లా ఉంది.దీంతో అది దోశే కాదని ఈ వీడియో కట్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు.ఇదేంది..మిడిల్ క్లాస్ దోశనా! అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Paper Dosa😌#FamilyStar pic.twitter.com/7pBjMUybaM
— Aravind Kethari (@aravindkethari8) March 12, 2024
“అన్నో.. ఏం దోశన్నో అది.కొత్త రకం మిడిల్ క్లాస్ దోశనా?” అని మరొకరు పోస్ట్ చేశారు.దీంతో ఈ వీడియో క్లిప్ బాగా వైరల్ అయ్యి..ఫ్యామిలీ స్టార్ టీమ్ వరకు వెళ్ళింది. దీంతో ఈ విషయంపై శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations)స్పందించింది.
April 5th.
— Sri Venkateswara Creations (@SVC_official) March 13, 2024
We welcome you to clear all your doubts with your family 🤗❤️ #FamilyStar https://t.co/uK1AzRrsEU
ఫ్యామిలీ స్టార్ నిర్మించిన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ స్పందిస్తూ..“ఏప్రిల్ 5న..అన్ని డౌట్లను క్లియర్ చేసుకునేందుకు మీ ఫ్యామిలీతో కలిపి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం” అని రెస్పాండ్ అయింది. అంటే, థియేటర్లో సినిమా చూశాకనే ఈ దోశ డౌట్ తీరుతుందని చెప్పకనే చెప్పింది. మరి దోశ మిస్టరీ ఏంటో చిత్రంలోనే చూడాలి. అంతవరకు దోశ అలానే ఉంచకండి..తినేయండీ!