Bigg Boss: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి కొత్త హోస్ట్.. నాగార్జున స్థానంలో టాలీవుడ్ యంగ్ హీరో!

Bigg Boss: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి కొత్త హోస్ట్.. నాగార్జున స్థానంలో టాలీవుడ్ యంగ్ హీరో!

బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) మేకర్స్ నుంచి కొత్త టాక్ వినిపిస్తోంది. రాబోయే సీజన్‌కు (సీజన్ 9) హోస్ట్గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ కోసం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

ఈ నేపథ్యంలో 9 వ సీజన్ను విజయ్ దేవరకొండతో హోస్ట్గా చేయించుటకు మేకర్స్ సిద్దమైనట్లు టాక్ వినిపిస్తోంది. ప్రేక్షకుల్లో విజయ్ దేవరకొండకు ఉన్న ప్రజాదరణ బట్టి బిగ్ బాస్ మేకర్స్ నిర్ణయంలో కీలకమైన అంశం కావచ్చని తెలుస్తోంది. అలాగే, విజయ్ దేవరకొండ రాకతో ఈ షోకి కొత్త ఆకర్షణ వస్తుందని అనుకుంటున్నారు. అంతేకాకుండా దేవరకొండకు టెలివిజన్ హోస్టింగ్ ఎంట్రీ కూడా అవుతుందిని భావిస్తున్నారు. అయితే, ఈ విషయంపై బిగ్ బాస్ నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రముఖ నివేదికల ప్రకారం.. కొన్ని రోజులుగా ఈ షోకు నాయకత్వం వహించడానికి కొత్త వ్యక్తి కోసం మేకర్స్ అన్వేషిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా యూత్లో బాగా క్రేజీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ అయితేనే న్యాయం చేయగలడని మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

గత ఏడు సీజన్లకు హీరో నాగార్జున తెలుగు బిగ్ బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మొదటి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించగా, ఆ తర్వాత సీజన్ 2లో నాని హోస్ట్‌గా వ్యవహరించారు. మూడవ సీజన్ నుండి, నాగార్జున హోస్టింగ్ బాధ్యతలను స్వీకరించారు.

ఇకపోతే, బిగ్ బాస్ తెలుగు సీజన్–8లో నిఖిల్ విజేతగా నిలిచాడు. 105 రోజుల పాటు సాగిన రియాలిటీ షోలో తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించి నిఖిల్ ​టైటిల్​సొంతం చేసుకున్నాడు. రన్నర్‌గా గౌతమ్ వెనుదిరిగాడు. సినీ హీరో రామ్ చరణ్ తేజ్​చీఫ్​గెస్టుగా పాల్గొని నిఖిల్ కు ట్రోఫీని అందజేశాడు. అలాగే రూ. 55 లక్షల క్యాష్ ప్రైజ్, కారును నిఖిల్ గెలుచుకున్నాడు. రెండో స్థానంలో నిలిచిన గౌతమ్​కు రూ.25లక్షల క్యాష్​ప్రైజ్​లభించింది.

ALSO READ | TEST OTT Official: ఓటీటీలోకి నయనతార, సిద్ధార్థ్ స్పోర్ట్స్ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్

ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్ డమ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజై అంచనాలు పెంచేసింది. సమ్మర్ కానుకగా మే 30న రిలీజ్ కానుంది.