Vijay Deverakonda: ఫస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డుని అమ్మేసిన విజయ్..ఆ వచ్చిన డబ్బు ఏం చేశాడో తెలుసా?

చిన్న చిన్న నాటకాల్లో నటించిన విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)..రౌడీ బాయ్గా, స్టార్ భాయ్గా సినిమాల్లో మంచి గుర్తింపు పొందారు. నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాల్లో అతిధి పాత్రల్లో నటించిన విజయ్..పెళ్లి చూపులు మూవీతో తెలుగు ఇండస్ట్రీని, అర్జున్ రెడ్డితో ఇండియా వైడ్గా ఫ్యాన్స్ని సొంతం చేసుకున్నాడు.అంతేకాదు..తన సోషల్ మీడియా ఖాతాలో కూడా మంచి గుర్తింపు పొందాడు. 

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండకు వచ్చిన ఇమేజ్ అంతా ఇంతాకాదు. ఆయన్నో స్టార్ ను చేసేసింది. యూత్ ఐకన్ గా మార్చేసింది. సిన్సియర్ లవర్ గా..లవ్ లోని డెప్త్ను చూపించిన ఈ తరం దేవదాసు అర్జున్ రెడ్డి.తెలుగులో కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిన అర్జున్ రెడ్డిలాంటి ..ప్రేమ గాఢత ఉన్న విజయ్ దేవరకొండ అగ్రీసివ్ యాక్టింగ్ తో ఆడియన్స్ ని  మెప్పించాడు.

అయితే, ఇపుడు అసలు విషయానికి వస్తే..అర్జున్ రెడ్డి సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమాకు గాను 2018లో ఫిల్మ్ ఫేర్ అవార్డును విజయ్ దక్కించుకోగా..2019 లోనే ఆ అవార్డును అమ్మేశాడు.ఇంతకీ అవార్డు అమ్మడం ఏంటని అందరూ అనుకోవొచ్చు.కానీ,నిజమే అమ్మేశాడు. అసలుతన కెరీర్ లో వచ్చిన ఫస్ట్ అవార్డు అది. అయినా సరే దాన్ని మాత్రం దాచిపెట్టుకోవడం కన్నా..ఏదైనా మంచి పనికి, ఓ నలుగురు బాధని తీర్చడానికి  ఉపయోగించాలని డిసైడ్ అయి ఫిల్మ్ ఫేర్ అవార్డును ఆక్షన్లో పెట్టాడు.

అయితే..ఈ అవార్డుకి విజయ్ వేసుకున్న అంచనా ప్రకారం..దానికి ఒక రూ. 5 లక్షల దాకా వస్తాయని అనుకున్నారు. అలాంటి టైం లోనే  దివి ల్యాబ్స్ వారు దాన్ని ఏకంగా పాతిక లక్షలకు కొన్నారు. మరింతకు ఈ అవార్డును కొన్న పర్సన్ ఎవరంటే..దివి ల్యాబ్స్ ఫ్యామిలీ సభ్యురాలు శ్యామలా దేవి. ఇక విజయ్ అవార్డు పేరు మీద వచ్చిన ఆ మొత్తాన్ని సిఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చేశాడు. అలా తన కెరీర్ లో వచ్చిన ఫస్ట్ అవార్డు అమ్మేసి సీఎం రిలీఫ్ ఫండ్ కు అమౌంట్ ఇచ్చాడంటే..అతనిలో ఎంత హ్యూమానిటీ ఉందో అర్ధమైపోయింది. 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ డైరెక్టర్ పరుశురాం తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 5న థియేటర్స్ లోకి రాబోతోంది.దీంతో ప్రమోషన్స్ లో వేగం పెంచిన విజయ్కి రీసెంట్గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అమ్మడంపై ఓ ప్రశ్న ఎదురవగా..అప్పట్లో విజయ్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ఆక్షన్లో అమ్మేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ALSO READ :- Kiran Abbavaram: హనుమాన్ మేకర్స్తో కిరణ్ అబ్బవరం.. పాన్ ఇండియా మూవీ సంగతేంటి?

అయితే, ఇప్పటివరకు ఈ విషయం ఎంతో మందికి తెలియదు. దీంతో విజయ్ ఫ్యాన్స్..గ్రేట్ అన్న మీరు..అని కొందరు అంటుండగా మరికొందరు హ్యాట్సాఫ్ విజయ్ అంటూ కామెంట్స్ తెలుపుతున్నారు.ప్రస్తుతం ఈ న్యూస్ ఫ్యామిలీ స్టార్ కు ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది.