మైక్ టైసన్ దెబ్బలకు కాన్ఫిడెన్స్ పెరిగింది 

హైదరాబాద్: పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘లైగర్’. ఈ మూవీతో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ భారతీయ సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను విజయ దేవకరొండ మీడియాతో పంచుకున్నాడు. మైక్ టైసన్ తో కలసి నటించడం గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నాడు. అయితే షూటింగ్ టైమ్ లో టైసన్ తనను కొట్టాడన్నాడు. ‘టైసన్ తో కలసి యాక్ట్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. షూట్ లో ఆయన నన్ను కొట్టాడు. దీంతో నా తల తిరిగినట్లయింది. కానీ ఆ ఘటన నాలో ఎంతో విశ్వాసాన్ని నింపింది. సరదాగానూ అనిపించింది. ఇది జీవితాంతం గుర్తుంటుంది. ఇంతకంటే ఎక్కువ రివీల్ చేయలేను’ అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. 

పూరీ కాంబోలో తాను నటించబోయే కొత్త చిత్రం ‘జనగణమన’ (జేజీఎం) ప్రారంభోత్సవం సందర్భంగా రౌడీ స్టార్ పైవ్యాఖ్యలు చేశాడు. లైగర్ లో నటించే అవకాశం ఇచ్చినందకు దర్శకుడు పూరీ, నిర్మాత కరణ్ జోహార్ కు విజయ్ థ్యాంక్స్ చెప్పాడు. అయితే సినిమా రిలీజైన తర్వాత కరణ్ తనకు కృతజ్ఞతలు చెప్పాలని.. ఎందుకంటే, ఈ చిత్రం రూపంలో ఆయనకో బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వబోతున్నామని సరదాగా కామెంట్ చేశారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న లైగర్ లో విజయ్ సరసన బాలీవుడ్ హార్ట్ త్రోబ్ అనన్యా పాండే నటిస్తోంది. సీనియర్ నటి రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, అలీ బాషా, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం:

మంచు మనోజ్ కారు బ్లాక్ ఫిల్మ్ తొలగించిన పోలీసులు

స్పోర్ట్స్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌ మూవీతో వస్తున్న వరుణ్‌‌ తేజ్