
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కింగ్‌డమ్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మే 30న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. టైటిల్ గ్లింప్స్‌తో అంచనాలు పెంచారు.
తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ప్రొమోను ఈనెల 30న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కింగ్‌డమ్ వరల్డ్ నుంచి అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ పాట అందరినీ అలరిస్తుందని మేకర్స్ తెలియజేశారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న టేబుల్ చైర్‌లో కూర్చొని వెనుక నుంచి కనిపిస్తుండటం చూస్తుంటే ఇదొక లవ్ సాంగ్ అని అర్థమవుతోంది. మరోవైపు రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు.
‘రౌడీ జనార్ధన్’ టైటిల్‌తో తెరకెక్కే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో లొకేషన్స్ గుర్తించే పనిలో ఉన్నారు మేకర్స్. పీరియాడికల్ రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించబోతోందని సమాచారం.