సంక్రాంతి రేసులో విజయ్ దేవరకొండ కొత్త సినిమా

విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్. బుధవారం ఈ సినిమా షూటింగ్ ప్రోగ్రెస్‌‌తో పాటు రిలీజ్‌‌ డేట్‌‌ గురించి అప్‌‌డేట్ ఇచ్చారు మేకర్స్. శరవేగంగా షూటింగ్ జరుగుతోందని, ఇప్పటికే యాభై శాతం షూట్ పూర్తయిందని చెప్పారు. 

అలాగే సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరిలో సినిమాను విడుదల చేయబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌‌ను విడుదల చేయనున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం  అందిస్తున్నాడు. విజయ్ కెరీర్‌‌‌‌లో ఇది 13వ చిత్రం. ‘గీత గోవిందం’ తర్వాత విజయ్, పరశురాం కాంబినేషన్‌‌లో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు పెరిగాయి.