యంగ్ డైరెక్టర్ తో సైలెంట్ గా కానిచ్చేస్తున్న టాలీవుడ్ రౌడీ.. టైటిల్ కూడా ఫిక్స్ అయ్యిందట..

యంగ్ డైరెక్టర్ తో సైలెంట్ గా కానిచ్చేస్తున్న టాలీవుడ్ రౌడీ.. టైటిల్ కూడా ఫిక్స్ అయ్యిందట..

టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ ఈమధ్య సైలెంట్ గా షూటింగ్ ఫినిష్ చేసేస్తున్నాడు. ఇటీవలే  విజయ్, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న  కింగ్‌డమ్ టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ కాగా మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమాలో యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రాజావారు రాణిగారు సినిమాతో మంచి క్లాసికల్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలాతో నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని ప్రముఖ సినీ నిర్మాత డీలా రాజు నిర్మిస్తున్నాడు. అయితే  ఈ సినిమాకి ఇప్పటికే "రౌడీ జనార్ధన్" అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాని రాయలసీమలోని ఓ ప్రముఖ ఫ్యాక్షనిస్ట్ రియల్ లైఫ్ బేస్ చేసుకుని తీస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన లుక్ టెస్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ మాస్ ఇమేజ్ కి రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ పడితే బ్లాక్ బస్టర్ హిట్ తప్పదని రౌడీ ఫ్యాన్స్ అంటున్నారు.

ALSO READ | SSMB29 Updates: ఒడిశా అడవులకి బయల్దేరిన మహేష్.. ఎయిర్ పోర్ట్ లో నమ్రత ఎమోషనల్ సెండాఫ్.. 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ మిస్టర్ బచ్చన్  మూవీ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.  దీంతో ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.