తమిళ స్టార్ హీరో విజయ్(Vijay) కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా జూన్ 22న ఆయన పుట్టినరోజు వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు ఆయన అభిమానులు. ఇక వేలూరులో కూడా విజయ్ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు వేల్‌మురుగన్ అధ్యక్షతన వేలూరు శిశు భవన్‌లోని అనాథ పిల్లల మధ్య కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు.
ఇందులో భాగంగా వేలూరు పెట్‌లాండ్ ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం జన్మించిన చిన్నారులకు బంగారు ఉంగరాలు కానుకగా ఇచ్చారు. ఈ సందర్బంగా అధ్యక్షుడు వేల్‌మురుగన్ మాట్లాడుతూ.. "సూపర్ స్టార్ విజయ్ జన్మదినం శిశు భవనంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. తమ నాయకుడు త్వరలో రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో విజయ్ తలతలపతి అభిమానుల సంఘం కార్పొరేషన్ అధ్యక్షుడు శంకరన్, కార్యదర్శి సురేష్, భరత్, డివిజన్ కార్యదర్శి రాజేష్, జాయింట్ కార్యదర్శి వివేక్ పాల్గొన్నారు.
ALSOREAD:వైరల్ అవుతున్న కియారా పొట్టి స్కర్ట్.. ధర తెలిస్తే మతిపోతుంది