బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో తన 12వ చిత్రంలో నటిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ను అందించారు నిర్మాత నాగవంశీ. వీడీ 12 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ టైటిల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
‘మీ అందరి కోరిక మేరకు.. నేను గౌతమ్‌ను చాలా హింస పెట్టాక చివరకు టైటిల్ లాక్ అయ్యింది. అతి త్వరలోనే టైటిల్ అనౌన్స్ చేస్తాం’ అని పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ‘సామ్రాజ్యం’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. తన సామ్రాజ్యం కోసం విజయ్ ఏం చేశాడనేది ఈ కథ.
ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా, ఖైదీగా రెండు గెటప్స్‌లో విజయ్ కనిపించనున్నాడని సమాచారం. ఇప్పటికే విడుదలైన తన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.