కరుణ్ నాయర్ ఐదో సెంచరీ

  • హజారే  సెమీస్‌‌లో విదర్భ, హర్యానా

వడోదర: టీమిండియాకు దూరమైన కరుణ్ నాయర్ (82 బాల్స్‌‌లో 13 ఫోర్లు, 5 సిక్సర్లతో 122) విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌‌లో ఐదో సెంచరీతో మెరిశాడు. దాంతో ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో కరుణ్ కెప్టెన్సీలోని విదర్భ 9 వికెట్ల తేడాతో రాజస్తాన్‌‌ను ఓడించి సెమీఫైనల్ చేరుకుంది.

 తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు వచ్చిన రాజస్తాన్‌‌ నిర్ణీత 50 ఓవర్లలో 291/8 స్కోరు చేసింది. కార్తీక్ శర్మ (62), శుభమ్‌‌ గర్వాల్ (59), దీపక్ హుడా (45) రాణించారు. యశ్ ఠాకూర్ 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం కెప్టెన్ కరుణ్ నాయర్‌‌‌‌కు తోడు ఓపెనర్ ధ్రువ్ షోరే (118 నాటౌట్‌‌) కూడా సెంచరీతో సత్తా చాటడంతో విదర్భ 43.3 ఓవర్లలోనే 292/1 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. మరో మ్యాచ్‌‌లో హర్యానా 2 వికెట్ల తేడాతో గుజరాత్‌‌పై గెలిచి సెమీస్‌‌లో అడుగు పెట్టింది.