తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి(Vijay thalapathi) సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నాడా? అంటే అవుననే వార్తలు బలంగా విపిస్తున్నాయి. దానికి కారణం ఆయన రాజకీయంగా బిజీ అవుదామనుకోవడమే. ప్రస్తతం ఈ న్యూస్ కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనియ్యాంశంగా మారింది. ఇక విజయ్ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన అభిమానుల్లో కొంతమంది సంతోషంలో మునిగి తేలుతుంటే.. మరి కొందరు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే విజయ్ చేయబోయే చివరి సినిమా ఇదే అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ప్రస్తుతం విజయ్, లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) దర్శకత్వంలో లియో(Leo) అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
Aslo Read :- గుమ్మడికాయ కొట్టేసిన భోళాశంకర్
ఇక ఈ సినిమా తరువాత.. విజయ్, క్రియేటీవ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు(Venkat prabhu)తో మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా అఫీషియల్ గా మొదలైంది. అయితే ఇదే విజయ్ చివరి సినిమా అని, ఈ సినిమాను రాబోయే ఎలక్షన్స్ వరకు పూర్తి చేసి.. ఆతరువాత సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నాడని సమాచారం. ఈ సినిమా కూడా పిలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రానుందట. అందుకే ఈ సినిమాను ఎలక్షన్స్ వరకు కంప్లీట్ చేసి.. ఆడియన్స్ పై పొలిటికల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనేది విజయ్ ప్లాన్. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకట రావాల్సి ఉంది. మరి విజయ్ తీసుకున్న ఈ డెసిషన్ పై ఆయన అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారా అనేది చూడాలి మరి.