హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచరులు బెదిరిస్తు న్నారని, వారితో తనకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ బహిష్కృత నేత కురువ విజయ్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, 15 ఏండ్లుగా పార్టీలో పనిచేసినా తనకు టికెట్ ఇవ్వకుండా చివరి నిమిషంలో చేరిన వారికి గద్వాల్ టికెట్ ఇచ్చారని వాపోయారు.
ఎమ్మెల్యే టికెట్లను డబ్బులు, భూములకు రేవంత్ రెడ్డి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. రేవంత్ అక్రమాస్తులపై ఈడీకి ఫిర్యాదు చేస్తే, ఆయన అనుచరులు తనను వేధిస్తున్నారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల నాయకులను అణగదొ క్కేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసిన తనను అకారణంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు.