Leo Twitter Review: లియో సినిమా ఎలా ఉంది? అంచనాలను రీచ్ అయ్యిందా?

Leo Twitter Review: లియో సినిమా ఎలా ఉంది? అంచనాలను రీచ్ అయ్యిందా?

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌(Thalapathy Vijay) హీరోగా వచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ లియో(Leo). మాస్టర్(Master), విక్రమ్‌(Vikram) లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత లోకేష్‌ కనగరాజ్‌(Lokesh kanagaraj) తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో.. తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానితో తోడు సాంగ్స్, ట్రైలర్ కూడా నెక్స్ట్ లెవల్లో ఉండటంతో ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి. దీంతో ఈ సినిమాను చూసేందుకు విజయ్ ఫ్యాన్స్ తో పాటు, సినీ లవర్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేశారు.

ఇక ఈ సినిమా నేడు(అక్టోబర్ 19) భారీ అంచనాలు మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల షోస్ పడిపోయాయి. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు, అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. మరి లియో మూవీ ఎలా ఉంది? లోకేష్, విజయ్‌ కాంబో ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించారు?LCU సంగతేంటి? అనేది ఇప్పుడు చూద్దాం.

Also Read :- భగవంత్ కేసరి ఎలా ఉంది?

లియో సినిమాకు ట్విటర్‌లో ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ నుండి మిక్సుడ్ టాక్ వస్తోంది. లోకేష్‌ స్టైలీష్ మేకింగ్‌ అదిరిపోయిందని కొందరు అంటుంటే.. మరికొందరేమో కథనం చాలా స్లో గా ఉందంటున్నారు. ఇక విజయ్‌ తన నటనతో ఇరగదీసాడు కానీ కథలో కొత్తదనం లేదని కామెంట్స్ చేస్తున్నారు. అయినప్పటికీ ఈ కాంబో మరో హిట్టును తమ ఖాతాలో వేసుకున్నారని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. ఇక లియో సినిమాకి మేజర్ హైలెట్ అనిరుధ్ సంగీతం అని, పాటలతో పాటు, తన ఎలక్ట్రిఫైయింగ్ బీజీఎమ్ తో సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాడని చెప్తున్నారు. ఇక మొత్తంగా చేసుకుంటే.. ఫస్టాఫ్‌ డీసెంట్‌గా, సెకండాఫ్‌ యావరేజ్‌ గా ఉందనే కామెంట్స్ చేస్తున్నారు. ఇక సంజయ్‌ దత్‌, అర్జున్‌ లాంటి స్టార్స్ ను సరిగా వాడుకోలేకపోయారని.. ఖైదీ, మాస్టర్‌, విక్రమ్‌, సినిమాలతో పోలిస్తే.. లియో కాస్త తక్కువే అని అంటున్నారు.